సీనియర్ యాక్టర్ నాజర్.. క్రేజీ ఫోటో షూట్..

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభిమానులకి, సెలెబ్రిటీలకి మధ్య దూరం తగ్గిపోయింది. సెలెబ్రిటీలు, తమ అభిరుచులను, అభిప్రాయాలని అభిమానులతో పంచుకోవడం ద్వారా మరింతగా దగ్గరవుతున్నారు. ఐతే సినిమా ఉన్నా, లేకపోయినా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే సెలెబ్రిటీలు తమ ఫోటోలని షేర్ చేస్తుంటారు. హీరో, హీరోయిన్లు ఈ విషయంలో చాలా ముందుంటారు.

రెగ్యులర్ గా ఫోటోలు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుంటారు. ఐతే తాజాగా సీనియర్ నటుడు నాజర్ క్రేజీ ఫోటో షూట్ తో అందరినీ అలరించాడు. ఎన్నో ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాజర్, ఇప్పటి వరకూ ఇలాంటి ఫోటో షూట్ చేసి ఉండడు. నటుడిగా విలక్షణమైన పాత్రల్లో కనిపించి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా.. ఏ పాత్ర చేసినా తనదైన ముద్ర వేస్తుంటారు.

 

ఐతే సోషల్ మీడియా ద్వారా ఆయన పంచుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ట్రెండీ గెటప్ లో, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో, అల్ట్రా పాష్ గా కనిపిస్తున్నారు. ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఆయన ఫోటోలు చూసి షాకవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.