కొంతమంది రాజకీయ నాయకులకు మైకు దొరకడం ఆలస్యం… మనం ఎవరిపై విమర్శలు చేస్తున్నాం.. ఎవరి గురించి మాట్లాడుతున్నాం.. మనకున్న హక్కు ఏమిటి.. మనకున్న అర్హత ఎంత.. అనేది అన్నీ మరిచిపోతారు! ఎంత ప్రజాస్వామ్యం అయినా… పాలకులు – నాయకులూ రాజకీయ విమర్శలు చేసుకుంటే ఆ లెక్కవేరు! కానీ… అత్యున్నత పదవిలో ఉన్న అధికారులపై పనికిమాలిన విమర్శలు చేయడం సబబేనా? అవన్నీ మరిచిపోయి ఏపీ డీజీపీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు టీడీపీ నేత పట్టాభిరాం!
రాజకీయ నాయకులు ఎవరిని ఎవరు ఏమనుకున్నా పర్లేదు! ఎందుకంటే మెజారిటీగా వారంతా కొన్ని విషయాల్లో ఒకతానులో ముక్కలే! కాని ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. ఒక రాష్ట్రానికి డీజీపీగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై మైకు దొరికిందికదా అని పిచ్చి ప్రేలాపణలు పేలిత్… అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు! ఈ విషయంలో టీడీపీ నేత పట్టాభిరాం… “డీజీపీ గౌతమ్ సవాంగ్ తన టోపీపై ఉన్న మూడు సింహాలను తాడేపల్లి ప్యాలెస్ లో తాకట్టు పెట్టారా?” అని ప్రశ్నిస్తున్నారు!
ఇంతకష్టపడి చదువుకుని, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి, నేడు పోలీసు ఉద్యోగంలోనే అత్యున్నత పదవిలో ఉన్న ఒక అధికారి… నేడు పట్టాభిరాం వంటి నేతల దగ్గర మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్న మాట! వారిపై కూడా రాజకీయ విమర్శలు చేసే సాహసం చేసేస్తున్నారు ఏనాడూ ప్రజాక్షేత్రంలో గెలవని కొందరు టీవీ డిబేట్ నేతలు! ఈ విషయంలో ఏపీ పోలీసులు చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వారి నోటికి తాళాలు వేసేలా చర్యలకు ఉపక్రమించాలని పలువురు కోరుకుంటున్నారు!!
-CH Raja