ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు దగ్గర పడుతున్న కొద్ది వేడి రగులుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసింది. తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో జనసేన 05, టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ టీడీపీ అధినేత ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల్లో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఇంకా వైసీపీ నుంచి టీడీపీలో చేరని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి స్థానం దక్కడం గమనార్హం. ప్రస్తుతం పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నఆయన తొలి జాబితా ప్రకారం.. నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అధికార వైసీపీలో ఉన్న ఆయన ఆ పార్టీలో స్థానం దక్కకపోవడంతో టీడీపీ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరనున్నారు. దీంతో ఆయనకు టీడీపీ నూజివీడు టికెట్ ఇచ్చారు. నూజీవీడు టీడీపీ ఇన్ చార్జీగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు.