TDPకి 54 సీట్లు మాత్రమే వస్తాయని విజయవాడం ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్ధుల లిస్టులో ఎంపి అభ్యర్ధిగా అవకాశం ఇచ్చిన జగన్ కి కృతజ్ఞతలు చెప్పారు. నన్ను టిడిపి మెడపట్టుకుని అవమానకరంగా గెంటేసిందని…నన్ను అక్కున చేర్చుకుని సీటిచ్చారని జగన్ పై ప్రశంసలు కురిపించారు. నారా లోకేష్ సీఎం అవడమే చంద్రబాబు లక్ష్యం….చంద్రబాబు విజయవాడని స్మశానం చేయాలని కంకణం కట్టుకున్నాడని ఆగ్రహించారు.
MPగా గెలిచి జగన్‌కు అంకితమిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభించారు కేశినేని నాని, నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ….ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ ఇది అని తెలిపారు. నా ఆటోనగర్.. నాకు ఎంతో ఇష్టమైన ప్రాంతమని వివరించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.
వాటర్ ట్యాంకుకు ఎంపి లాడ్స్ నిధులతో పాటు, ఐలా నుంచీ అవినాష్ సహకారంతో నిధులు వచ్చాయని పేర్కొన్నారు. సమర్ధత కలిగిన వ్యక్తి అవినాష్, నేను కూడా సమర్ధుడినేనన్నారు. నన్ను, అవినాష్ ని గెలిపించాలని కోరారు. మేం ఇద్దరం కలిస్తే డబుల్ రీటైనింగ్ వాల్ అంటూ వ్యాఖ్యానించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. సమర్ధులకు ఓటేయండి… జగన్ ని, నన్ను, అవినాష్ ని గెలిపించండి…తూర్పు నియోజకవర్గం కనుక ఇంత క్లారిటీతో చెపుతున్నానని వివరించారు.