ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై నాలుగేళ్లు కావొస్తున్నా ఈ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీని విచారించేందుకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ నోటీసులతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దాఖలు చేశారు.

ఈ పిటిషన్​పై విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇటీవలే విచారణ చేపట్టి.. అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది, సీబీఐ తరఫు లాయర్ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఇవాళ ఈ కేసులో తీర్పు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికి కన్నా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని.. అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news