తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 21 రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సచివాలయంలో CM KCR చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం నివాళులు అర్పిస్తారు. 10:30 గంటలకు సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన సభలో కెసిఆర్ సందేశం ఇస్తారు. ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరుకావాలని సి ఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
ఇదే సమయంలో జిల్లాల్లోనూ మంత్రుల ఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశ కార్యక్రమాలు జరుగుతాయి. సచివాలయంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, సిబ్బంది హాజరుకావాలని సీఎస్ శాంతికుమారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.