చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించను : కొడాలి నాని

-

చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని క్షమాపణలు చెప్పాల్సిందేనని..కాపు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాపులను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వాక్యాలు వివాదాస్పదమయ్యాయి. పలు కాపు సంఘాలు నాని వాక్యాలపై మండిపడుతున్నాయి. అయితే.. ఈ వివాదంపై కొడాలి నాని స్పందించారు.

వంగవీటి రాధా గుడివాడ నుంచి పోటీ చేయడు, రాధా నా సొంత తమ్ముడి లాంటివాడు అన్నారు. 20 ఏళ్ల నా రాజకీయ జీవితంలో వచ్చిన నా గెలుపుల్లో కాపులదే సగభాగం, చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించనని స్పష్టం చేశాడు కొడాలి నాని. టీడీపీవాళ్లు నేను మాట్లాడిన దాన్ని కట్ పేస్ట్ చేసి వీడియోలు వదిలారు, అవి చూసి జనసైనికులు స్పందిస్తున్నారు, జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ నేను పాల్గొనలేదని వెల్లడించారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news