పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇప్పుడే ఓ ఎన్నికను పూర్తి చేసుకున్న రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

అందుకు అనుగుణంగా ఈ నెల 30వ తేది లోపు రిటర్నింగ్‌ అధికారులతో పాటు, పోలింగ్‌ విధుల్లో పాల్గోనే సిబ్బంది జాబితాను రూపొందించాలని సూచించింది. అంతే కాకుండా వారికి శిక్షణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని పంచాయతీల పాలక మండళ్ల కాల పరిమితి 2024 ఫిబ్రవరి 1వ తేదితో ముగుస్తుందని… పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం అంతకంటే మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని  ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. ఇటీవలీ శాసనసభ ఎన్నికల్లో పాల్గన్న సిబ్బంది వివరాలు అందుబాటులో ఉన్నందున ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news