Cyclone Michaung : పాపికొండల విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా పాపికొండల విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద పర్యటనకు వెళ్లే మొత్తం బోట్లు నిలిపివేశారు.
పోశమ్మ గండి వద్ద ఏపీటీడీసీ బోటుతోపాటు మొత్తం 15 బోట్లను నిలిపివేశామని ఈ మేరకు కంట్రోల్ రూమ్ సూపర్వైజర్ పి నాగరాజు ప్రకటించారు. తుఫాన్ తగ్గిన అనంతరం అనుమతులు ఇస్తామని వెల్లడించారు. ఇక అటు మిచౌంగ్ తుఫాన్ కారణం గా విశాఖలో బీచ్‌లు మూసివేశారు. అంతేకాదు ఆర్కే బీచ్‌లో పోలీసుల ప్రత్యేక పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని బీచ్‌ల వద్ద పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతోంది. పర్యాటకులు బీచ్ లోకి దిగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే…మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీగా విమానాలు రద్దు అయ్యాయి. గన్నవరం నుంచి నడిచే 15 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.