రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోంది – పయ్యావుల కేశవ్

-

కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్టు చేయడం పై స్పందించారు టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ టెర్రరిజం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరసన తెలిపితే చంపేస్తారా..? ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? అని ప్రశ్నించారు.

- Advertisement -

ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి వైసిపి నేతలు పిలుపునిస్తే.. ఎమ్మెల్యేకు రక్షణ ఇవ్వాల్సింది పోయి ముట్టడికి సహకరిస్తారా..? అని ప్రశ్నించారు. నాలుగేళ్లయిన జగన్ పరిపాలన తీరులో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పయ్యావుల కేశవ్. వెంటనే వీరాంజనేయ స్వామిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...