రాజస్థాన్ లో గ్యాస్ సిలిండర్ కేవలం రూ. 500.. ఇది కదా పాలన అంటే !

-

గత వారంలో రాజస్థాన్ లోని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ సాలరీలను తీసుకునే వెసులుబాటును కల్పించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా… తాజాగా ఆ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఎన్నో రాష్ట్రాలకు మార్గదర్శకం అని చెప్పాలి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా వంటకాలు వాడే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించి రూ. 500 కు అందించేందుకు ముందుకు వచ్చింది. గత ఎన్నికలలో అశోక్ గెహ్లాట్ ఇచ్చిన హామీల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ ప్రజలు అందరికీ ఇందిరాగాంధీ గ్యాస్ సిలిండర్ పధకం కింద రూ. 500 సిలిండర్ ను అందించనున్నారు. ఈ పధకం ద్వారా అన్ని నియమ నిబంధనలను అమలులోకి తీసుకున్నా 14 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

ఈ లెక్కన తీసుకుంటే ఒక్కో సిలిండర్ పైన సబ్సిడీ రాగా రూ. 640 తగ్గనుంది. అశోక్ గెహ్లాట్ నిర్ణయం పైన దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news