నకిలీ చలనా బాగోతం : పలువురు అధికారులు సస్పెండ్‌

-

నకిలీ చలాన్ల వ్యవహారం నేపథ్యంలో గుంటూరు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది నకిలీ చలానా కుంభకోణం. 2021 జనవరి నుంచి నకిలీ చలానాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు గుర్తించిన అధికారులు… 8 లక్షలకు నకిలీ చలానాలు ఇచ్చనట్లు గుర్తించారు. మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణమూర్తి.

దీంతో కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఈ స్కాం లో డాక్యుమెంట్ రైటర్లు, అసిస్టెంట్ల పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక అటు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి తనిఖీలు. విశాఖ లో 19, విజయ నగరం 13, శ్రీకాకుళం 15 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.

గజపతి నగరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రూ. 21 లక్షలు నకిలీ చలానాలు వెలుగు లోకి వచ్చాయి. ఇక ఇప్పటికే ముగ్గురు పై కేసు నమోదు చేశారు అధికారులు. మిగిలిన సబ్ రిజిస్టార్ కార్యాలయల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక అటు నంద్యాలలో సబ్‌ రిజిస్ట్రార్‌ మరియు జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెండ్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news