“మత మార్పిడి” ఏపీకి షాక్ ఇచ్చిన కేంద్రం…!

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ పాస్టర్లకు ఇచ్చిన ఐదు వేల రూపాయలపై కేంద్రం విచారణకు ఆదేశించింది అని ఆయన పేర్కొన్నారు. మత మార్పిడులకు ప్రోత్సహించిన పాస్టర్లకు ఐదు వేల నగదు ఇవ్వడాన్ని మత ప్రచారంగా భావిస్తున్నాం అన్నారు. హిందు మత ప్రచారానికి ఖర్చు చేయాల్సిన నిధులను ఇతర నిర్మణాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని విమర్శించారు.

కేంద్ర పధకాలను రాష్ట్ర ప్రభుత్వ పధకాలుగా చూపే ప్రయత్నం చేస్తోంది అని ఆయన ఆరోపించారు. ప్రజల సొమ్మును జాతీయ మీడియాకు ఇచ్చి ప్రభుత్వం భజన చేయించుకుంటుంది అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు అని విమర్శలు చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పార్టీ నేతలు జగనన్న భజన కార్యక్రమం చేస్తున్నారని… పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తామని చెబుతున్నా తిరిగి అనవసర రాగ్దాంతం చేస్తున్నారని విమర్శించారు.