ఏపీకి షాక్ ఇచ్చేందుకు కర్ణాటక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తుంగభద్రపై కర్ణాటక కుట్రలు చేస్తోందట. తుంగభద్ర నదిపై మరో రెండు బ్రిడ్జి కమ్ బ్యారేజిల నిర్మాణానికి ఎత్తుగడ వేసిందట కర్ణాటక సర్కార్. రాయచూరు జిల్లా చీకలపర్వీ, చిన్న మంచాల గ్రామాల సమీపంలో బ్రిడ్జి కమ్ బ్యారేజి నిర్మాణానికి సిద్ధమైంద కర్ణాటక ప్రభుత్వం.

ఏపీ లోని గ్రామాలను కలుపుతూ బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసిందని సమాచారం. కర్నూలులో ఇరిగేషన్ అధికారులు, కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు తో సమావేశమయ్యారట కర్ణాటక మంత్రి బోస్ రాజు. ఎగువన బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తే ఏపీకి నష్టమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై చంద్రబాబు నాయుడు సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.