70 ఏళ్ల పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్‌…కేంద్ర కేబినేట్‌ నిర్ణయాలు ఇవే

-

బుధవారం సమావేశం అయిన కేంద్ర కేబినేట్‌.. కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల నాలుగున్నర కోట్ల కుటుంబాలకు, 6 కోట్ల సీనియర్ సిటిజెన్లకు లబ్ధి చేకూరాలని ఉందని కేంద్రం ప్రకటించింది.

Cabinet approves Rs 5 lakh health cover for senior citizens above 70 under Ayushman Bharat Scheme

ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని… ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు హైడ్రో పవర్ కోసం 12,471 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. పీఎం ఈ డ్రైవ్ కోసం 10,900 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. పి ఎం ఈ బస్, పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం కోసం 3,435 కోట్ల రూపాయల కేటాయింపులు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం 70,125 కోట్ల కేటాయింపు, మిషన్ మోసమ్ ( వాతావరణం) కోసం 2,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది కేంద్ర కేబినేట్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news