ఆ అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయ్..త్వరలోనే వారిపై చర్యలు : మంత్రి నారా లోకేశ్

-

గత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసిన వారి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. బుధవారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని నొక్కిచెప్పారు. అదే విధంగా ప్రజలకు వ్యతిరేకంగా, కొందరు వ్యక్తుల మెప్పు పొందేందుకు పనిచేసిన ఐపీఎస్ అధికారులపై నివేదికలు రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని కానీ, కొందరు కావాలని పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారని మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. అధికారులు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, వారికి ఇబ్బందులు కలిగేలా ఎవరు పనిచేసినా వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

గత ప్రభుత్వంలో అత్యుత్సాసం ప్రదర్శించిన పలువురి ఐపీఎస్ అధికారులకు సంబంధించి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు గుర్తుచేశారు. రిపోర్టులు రాగానే వారు చేసిన దానికి తప్పక చర్యలు ఉంటాయని, ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఇదిలాఉండగా, మంతి నారా లోకేశ్ కావాలనే అధికారులపై కక్ష్య గట్టారని, ఈ క్రమంలోనే పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news