వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది: ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న వైసీపీ పై అసంతృప్తి సహజమని అన్నారు. అసంతృప్తి లేకుండా ఉండేందుకే సాచురేషన్ పద్ధతిలో సంక్షేమం అందిస్తున్నామన్నారు. ఎవరు నిస్పృహకు లోను కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పాలని చంద్రబాబు అనుకుంటున్నారని, ఎవరికీ తెలియకుండా లబ్ది అకౌంట్లో పడిపోతుంది అన్నారు.

కార్యకర్తలు గడపగడపకు వెళ్లి మన ప్రభుత్వం అందించే కార్యక్రమాలను అందించాలని అన్నారు. నయాపైసా కరెప్షన్ లేకుండా పని చేస్తున్నామని అన్నారు ధర్మాన. పలు శాఖలలో ఇంకా అవినీతి ఉంది అది మారాలని అన్నారు. అవినీతి లేని రాష్ట్రం చూడాలని జగన్ ఆకాంక్షిస్తూన్నారని తెలిపారు ధర్మాన. కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది.. కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ బ్రతకదని అన్నారు. గ్రామాలలో ఓటింగ్ మనకే ఉంది.. కానీ కార్యకర్తలలో అసంతృప్తి ఉందన్నారు. ప్రజల్లో తిరుగుదాం.. ఫీడ్బ్యాక్ తీసుకొని అధిష్టానానికి తెలియపరుస్తామ్ అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు ధర్మాన ప్రసాదరావు.