తిరుమల దర్శన టికెట్లలో పాండిచ్చేరి ప్రభుత్వ పీఆర్వో చేతివాటం ప్రదర్శించారు. పాండిచ్చేరి సీఎం సిఫార్సు పై ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు పొందాడు ఓ దళారీ. విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తానని భక్తుల వద్ద నుంచి 23వేలు తీసుకున్నాడట పద్మనాభన్ అనే వ్యక్తి. బ్రేక్ దర్శనంలో కాకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనంలో భక్తులను తీసుకెళ్లాడట పద్మనాభన్. 1800 వందల రూపాయల టికెట్లకు 23 వేలు వసూలు చేశాడు పద్మనాభన్.
రూ. 300/- దర్శనానికి ఇంత ధర ఎందుకంటూ దళారీతో గొడవకు దిగారు భక్తులు. పద్మనాభన్ సరైన సమాధానం చెప్పకపోవడంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ ను ఆశ్రయించారు భక్తులు. దీంతో విచారణ చేపట్టి భక్తుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించారు టీటీడీ విజిలెన్స్. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.