తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక అటు నిన్న ఒక్క రోజే టోకెన్ లేని భక్తులకు..తిరుమల శ్రీవారి సర్వదర్శనం చేసుకోవడానికి 10 గంటల సమయం పట్టింది. నిన్న ఒక్క రోజే 71,123 మంది భక్తులు..తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజే 26,689 మంది భక్తులు..తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
అంతేకాకుండా.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదు అయింది. ఇది ఇలా ఉండగా..అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో ఈనెల 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యనుగ్రహ విశేష హోమాన్ని టీటీడీ నిర్వహించనుంది. ఇందుకోసం ఆన్లైన్ టికెట్లను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనుంది. టికెట్ ధర రూ. 1000గా నిర్ణయించారు. ఒక టికెట్ పై ఇద్దరినీ అనుమతిస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని టీటీడీ పేర్కొంది.