TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఏకంగా 20 కంపార్టుమెంట్లలో తిరుమల శ్రీవారి భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలోనే… నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 69, 314 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే..నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 25,165 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.48 కోట్లుగా నమోదు అయింది.
కాగా, తిరుమలలో ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే ఆ రోజున ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఆ రోజున ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం, 9 గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం ఉంటుంది. ఇక ఆ రోజున రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.