తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత… భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. నల్గొండ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సభకు హెలికాప్టర్లో రానుండటం గమనార్హం. కృష్ణానది పై ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఈ సభలో ప్రధానంగా ప్రస్తావిస్తారని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ సభకు పార్టీ అగ్ర నేతలు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావుతో సహా కీలక నేతలందరూ రానున్నారు.
ఇక అటు నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు రేవంత్ రెడ్డి. రోడ్డు మార్గాన బస్ లలో మేడిగడ్డకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే 10.15 వరకు అసెంబ్లీలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులంతా కలిసి మేడిగడ్డ బయలుదేరుతారు. అసెంబ్లీ నుంచి బస్సు లలో మేడిగడ్డ కు రానున్నారు ప్రజా ప్రతినిధులు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల వరకు కాళేశ్వరం చేరుకోనున్నారు ప్రజా ప్రతినిధుల బృందం. అయితే…నేడు మేడిగడ్డకు రేవంత్.. నల్గొండకు కేసీఆర్ వెళుతుండటంతో…తెలంగాణ రాజకీయాలు వేడేక్కాయి.