తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. అటు టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 63376 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 25146 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే హుండి ఆదాయం 3.56 కోట్లుగా నమోదు అయింది.
కాగా, ఇవాళ, రేపు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఈ రోజు ఉదయం శ్రీ బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటలకు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం పెద్ద శేషు వాహన సేవలో పాల్గొననున్నారు చంద్రబాబు దంపతులు. ఇక రేపు ఉదయం 8 గంటలకు శ్రీ వకుల మాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.