భక్తులకు అలర్ట్.. ఈ ఏడాది రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

-

భక్తులకు అలర్ట్. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది.  ఈ సంవత్సరం సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శ్రీవారి జంట బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని చెప్పారు.

‘వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. అదేరోజు సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని.. 22న గరుడసేవ, 23న స్వర్ణ రథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం జరుగుతాయని చెప్పారు. ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15న ప్రారంభమై 19న గరుడ వాహనసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో సమాప్తం అవుతాయని వెల్లడించారు. పురటాసి మాసం రెండు బ్రహ్మోత్సవాలు కలసి వస్తుండటంతో ఈ సంవత్సరం భారీగా యాత్రికుల రద్దీ ఉండొచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news