తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఎండలు విపరీతంగా కొడుతున్న తరుణంలో…తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఇక ఈ తరుణంలోనే…కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం అవుతోంది.
ఇక అటు నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 73,801 మంది భక్తులు..దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి 23,055 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. అంతేకాకుండా…నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లుగా నమోదు అయింది.