ఇవాళ కవిత మధ్యoతర బెయిల్ పై తీర్పు ఇవ్వనుంది కోర్టు. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించింది కవిత. గత గురువారం నాడు కోర్టులో ముగిశాయి వాదనలు. కవిత మధ్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేసింది స్పెషల్ కోర్ట్. ఇక ఇవాళ ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇవ్వనుంది రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవెజా.
కవితకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వద్దని కోర్టు ముందు వాదనలు వినిపించిన ఈడీ… కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని తెలిపింది. లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు….డిజిటల్ ఆధారాలను కవిత ద్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఆమ్ ఆద్మి పార్టీకి హవాలా రూపంలో 100 కోట్ల ముడుపులు ఇచ్చారని… ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై ద్వారా కవిత 33 శాతం వాటా పొందిందని ఆరోపణలు ఉన్నాయి.