తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం

-

తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం అయినే నేడు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణ రథంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. శ్రీవారి నామస్మరణలతో వీధులన్నీ మార్మోగాయి. ఈ రథోత్సవంలో పాల్గొనడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు.. భూ దేవి కరుణతో సమస్త ధాన్యాలూ.. శ్రీవారి కరుణా కటాక్షాలతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు

మరోవైపు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 77, 366 మంది దర్శించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 24, 375 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.38 కోట్లుగా నమోదు అయింది. వేసవి కావడం, అందులోనూ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని టీటీడీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news