తిరుపతికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ 20 సెంటీ మీటర్ల వర్షం పడనుందట. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ,రేపు తిరుపతి, చిత్తూరు జిల్లా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఒక్క రోజులోనే 20 సెంటీ మీటర్ల వర్షం కురవవచ్చని అంచనా వేస్తున్నారు.
దీంతో ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్నారు తిరుపతి, చిత్తూరు అధికారులు.. ఇప్పటికే తిరుపతి, నగరి, కాళహస్తి, సత్యవేడులో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. తమిళనాడు పక్కనే చిత్తూరు, తిరుపతి ఉన్న తరుణంలోనే.. వర్షాలు కొడుతున్నాయి.
- చిత్తూరు
- జిల్లా కలెక్టరేట్ లోని పాత గ్రీవెన్స్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్:9491077356 మరియు ల్యాండ్ లైన్: 08572-242777*
- 📞కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్:9491077356 మరియు ల్యాండ్ లైన్: 08572-242777
- చిత్తూరు ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9491077011
- కుప్పం ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9966072234
- పలమనేరు ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9491074510
- నగరి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9701019083