నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే 750 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో 750 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

పెద్ద సంఖ్యలో హాజరై తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు టెంకాయలు కొట్టారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏపీలో మెగా DSC నోటిఫికేషన్ విడుదల ఐంది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. మెగా DSCకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, పరీక్ష షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది విద్యాశాఖ.
చంద్రబాబు జన్మదినం.. 750 టెంకాయలు కొట్టి మొక్కులు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో 750 టెంకాయలు కొట్టి మొక్కులు
పెద్ద సంఖ్యలో హాజరై టెంకాయలు కొట్టిన తెలుగుదేశం పార్టీ… pic.twitter.com/rLR6fhs03S
— BIG TV Breaking News (@bigtvtelugu) April 20, 2025