నేడు ఉద్యోగ సంఘాల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ.. పీఆర్‌సీ పై కీల‌క ప్ర‌క‌ట‌న‌!

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాలకు న‌డుస్తున్న పీఆర్‌సీ వివాదం ఈ రోజు కొలక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంది. నేడు ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మావేశం కానున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్నా.. 13 ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌ను అందుబాటులో ఉండాల‌ని సీఎంవో అధికారుల నుంచి స‌మాచారం వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. కాగ ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో సీఎం జ‌గ‌న్ నిర్వ‌హించబోయే స‌మావేశంలో పీఆర్‌సీ పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

ఈ స‌మావేశం అనంతరం సీఎం జ‌గ‌న్ పీఆర్‌సీ పై కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేసే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టికే ముఖ్యమంత్రి జ‌గ‌న్ పీఆర్‌సీ ఎంత ప్ర‌క‌టిస్తే ప్ర‌భుత్వం భారం ఎంత ప‌డుతుంది అనే దాని పై ఆర్థిక శాఖ ముఖ్య అధికారుల‌తో చ‌ర్చించార‌ని స‌మాచారం. అంతే కాకుండా పీఆర్‌సీ పై పూర్తి స‌మాచారాన్ని, ప్ర‌భుత్వం పై ప‌డే భారం పై ఆర్థిక శాఖ అధికారులు పూర్తి నివేదిక‌ను సీఎం జ‌గ‌న్ కు ఇచ్చార‌ని స‌మాచారం. ఏది ఎమైనా.. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఉద్యోగుల పీఆర్‌సీ పై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news