సూర్యాపేట మెడికల్ స్టూడెంట్ ర్యాగింగ్ ఘటనలో 13 మంది విద్యార్థుల అరెస్ట్

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించింది సూర్యాపేట మెడికల్ విద్యార్థి ర్యాగింగ్ ఘటన. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ ఘటనలో సంబంధం ఉన్న 13 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురిపై ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. వీరంతా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థులు.

ఈనెల 2న సూర్యాపేట మెడికల్ కాలేజ్ హస్టల్ లో ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై.. కొందరు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. బట్టలు విప్పి కెమెరాలతో ఫోటోలు తీశారు. దీంతో పాటు గుండు గీసేందుకు ప్రయత్నించారు. దీంట్లో నుంచి తప్పించుకున్న బాధితుడు.. తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తండ్రి డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు బాధితుడిని ర్యాగింగ్ నుంచి రక్షించారు.

ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు విచారణ కమిటీ కూడా ఏర్పడింది. విచారణ అనంతరం ఆరుగురు విద్యార్థులను బాధ్యుల్ని చేస్తూ కాలేజీ నుంచి ఒక సంవత్సరం సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news