నేడు సీఎం జగన్ పుట్టిన రోజు..సంబరాలు చేసుకుంటున్న వైసీపీ

-

నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు. తండ్రి వైయస్సార్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైయస్ జగన్. వైయస్సార్ మరణాంతరం కాంగ్రెస్ తో వచ్చిన విభేదాలతో 2011లో వైసీపీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

Today is CM Jagan’s birthday

ఆ తర్వాత పాదయాత్ర చేసి 2019లో 175 స్థానాలకు 151 చోట్ల సంచలన విజయంతో సీఎం అయ్యారు. వాలంటీర్లు, సచివాలయాలు, నవరత్నాలతో తన మార్క్ పాలన చూపిస్తున్న జగన్ నేడు 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే… నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు ఉన్న తరుణంలోనే.. వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news