ఏపీలో నేడు ఎర్త్ అవర్‌..గంటపాటు విద్యుత్ లైట్లు అపాలని ఆదేశాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎర్త్ అవర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎర్త్ అవర్ నువ్వు పాటించాలని ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 8:30 నుంచి తొమ్మిదిన్నర వరకు ఎర్త్ అవర్ పాటించాలని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా లైట్లు వాడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏపీలోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేని చోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేయడం ద్వారా ఎర్త్ అవర్ ప్రచారంలో పాల్గొనాలని కోరారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సూచించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు గవర్నర్.

పర్యావరణ పరిరక్షణకు మేధావులు ముందుకు రావాలని.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని ఆయన కోరారు. ఎర్త్ అవర్ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8:30 నుంచి తొమ్మిదిన్నర వరకు విజయవాడ రాజ్ భవన్ ఆవరణలో అన్నీ అనవసర లైట్లు ఆర్పి వేయాలని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news