నేడు కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు చంద్రబాబు. హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించనున్న టీడీపీ అధినేత.. నేడు నాలుగు మండలాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ తరుణంలోనే టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు సమక్షంలో వైసీపీ నుంచి టిడిపిలో చేరారు సీనియర్ వైసీపీ నేత వెంకటరమణ రాజు. దీంతో పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. పుంగనూరు అభ్యర్ధి చల్లా బాబు గెలుపునకు పనిచేస్తానని హామీ ఇచ్చారు వెంకటరమణ రాజు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమీ కలసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు.