వాహనదారులకు అలర్ట్‌…ఏపీలో ఇవాళ ట్రాఫిక్‌ ఆంక్షలు

-

నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం 4వ సభ ఉండనుంది. ఈ తరుణంలోనే… మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్న సీఎం జగన్..రానున్న ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

Traffic restrictions in AP today

వాహనాల దారి మళ్లింపు వివరాలు:

నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్ళు భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుండి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్ళించడం జరిగింది.హైదరాబాద్ వైపు నుండి ఒంగోలు వైపుకు వచ్చు భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా దారి మళ్ళించడం జరిగింది.

నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్ళు సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుండి నామ్ హైవే పై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లవలేను.ఒంగోలు వైపు నుండి విశాఖపట్నం వైపు NH 16 పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట నుండి NH 216 పైకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపడం జరుగుతుంది. ఒంగోలు వైపు నుండి విజయవాడ, గుంటూరు వైపు NH 16 పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లించడమైనది. ఒంగోలు వైపు నుండి చిలకలూరిపేట వైపు వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా దారి మళ్లించడమైనది.

Read more RELATED
Recommended to you

Latest news