Tragedy in AP 3rd class student died due to scorpion bite: అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదం చోటు చేసుకుంది. తేలుకుట్టి ఓ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో (మం) తొగురుపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తేలు కాటుకు మూడవ తరగతి చదువుతున్న హేమంత్ (10) మృతి చెందాడు.
తేలు కుట్టగానే.. వెంటనే బాలున్ని ఆస్పత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా కడప రిమ్స్ కు రెఫర్ చేశారు వైద్యులు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు హేమంత్. ఇక హేమంత్ మృతితో తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.