నేడు ఆదిలాబాద్ బంద్‌..జిల్లా వ్యాప్తంగా నిరసనలు !

-

నేడు ఆదిలాబాద్ బంద్‌.. ఆదిలాబాద్‌ ఏజెన్సీ బంద్‌ కు పిలుపు నిచ్చింది తుడుం దెబ్బ. ఇందులో భాగంగానే… ఆదిలాబాద్.. జిల్లా కేంద్రంలో ని బస్టాండ్ ముందు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నిరసనలు తెలుపుతున్నారు. బస్సులు బయటకు వెళ్లకుండా బైఠాయించారు తుడుం దెబ్బ నాయకులు. వలస లంబాడీ లను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని… GO MS నంబర్ 3ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తే బంద్‌ కు పిలుపునిచ్చారు.

Adilabad bandh today

TSPA (ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాలను) ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని… 40% ఆదివాసీలు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తిస్తూ, ఏజెన్సీ ప్రత్యేక DSC లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 29 శాఖలో ఉన్న GO లను చట్టంగా చేయాలని.. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేసి గిరి వికాసం ద్వారా బోరు బావులు మంజూరు చేయాలని ఆదిలాబాద్‌ ఏజెన్సీ బంద్‌ కు పిలుపు నిచ్చింది తుడుం దెబ్బ. ITDA ద్వారా ప్రత్యేక DSC నిర్వహించాలి. మరియు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని… ITDA లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news