తిరుమల శ్రీ వారి భక్తులకు అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఉందని టీటీడీ ప్రకటన చేసింది. 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక 61,904 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
అటు 31,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా నిన్న హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు గా నమోదు అయింది. కాగా, తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆన్ లైన్ లో నవంబర్ మాసంకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 48 గంటల పాటు భక్తులు ఎన్ రోల్ చేసుకునే అవకాశం కల్పించింది.