బీఆర్ఎస్ పార్టీలోకి బీజేపీ రామగుండం నేత కౌశిక్ హరి

-

 

రామగుండం బీజేపీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ పార్టీలోకి బీజేపీ రామగుండం నేత కౌశిక్ హరి రానున్నారు. రామగుండం నియోజకవర్గానికి చెందిన బిజెపి నేత కౌశిక్ హరి త్వరలో BRS పార్టీలో చేరనున్నారు.

నిన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన కౌశిక్ హరి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలో రామగుండంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి… పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కార్మిక సంఘాల నాయకుడిగా గుర్తింపు పొందిన కౌశిక్ హరి 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి, కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news