టీటీడీ ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయన్న ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న ప్రచారం అవాస్తవమని, అవన్నీ కల్పిత ఆరోపణలని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల ఈ తరహా చర్యలకు దిగడం బాధాకరమన్న బీఆర్ నాయుడు…. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు.

ఇక అటు టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో 100 కు పైగా గోవులు మృతి చెందాయని బాంబు పేల్చారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఈ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టారని ఫైర్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన వాళ్లంతా ఏమయ్యారు? అంటూ నిలదీశారు. మా హయాంలో దాదాపు 550 ఆవులను దాతల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చామన్నారు.