భక్తులకు అలర్ట్.. TTD సంచలన నిర్ణయం.. న‌డ‌క‌మార్గాల్లో ఈ పదార్థాల విక్రయాలు బంద్‌

-

తిరుమల భక్తులకు అలర్ట్. టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గాల్లో ఇటీవల క్రూరమృగాల సంచారం నేపథ్యంలో ఆ మార్గంలో పలు పదార్థాల విక్రయాలను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. భ‌క్తుల భ‌ద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు దుకాణదారుల‌కు ఆయన ప‌లు సూచ‌న‌లు చేశారు.

తిరుమల న‌డ‌క‌మార్గాల్లో విక్రయాల‌కు సంబంధించి అట‌వీ, ఎస్టేట్‌, ఆరోగ్యశాఖ‌ల అధికారుల‌తో పాటు ప‌లువురు భ‌క్తులు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు చెప్పారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్రయించే దుకాణాలు ఉన్నాయ‌ని.. వాటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్రయించ‌రాద‌ని సూచించారు.

భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వాటి రాక పెరుగుతోంద‌ని, ఈ జంతువుల కోసం క్రూర‌మృగాలు అటువైపు వ‌చ్చి భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని వివ‌రించారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తినుబండారాల దుకాణదారులు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధ‌న‌లు త‌ప్పక పాటించాల‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news