తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆన్ లైన్ లో నవంబర్ మాసంకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 48 గంటల పాటు భక్తులు ఎన్ రోల్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ….ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఎన్ రోల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇది ఇలా ఉండగా ఎల్లుండి గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ నిర్వహించనుంది టీటీడీ. ఇక రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఈ నెల 22వ తేదిన దర్మగిరిలో కారీరిష్టి యాగం నిర్వహించనుంది టీటీడీ పాలక మండలి. ఇక ఈ నెల 24వ తేదిన ఆన్ లైన్ లో నవంబర్ నెలకు సంబంధించిన 300 రుపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.