తిరుమల భక్తులకు అలర్ట్…అలిపిరి నడకమార్గంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు టీటీడీ అధికారులు. మొన్నటి నుంచి తిరుమల అలిపిరి నడకమార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.

12 సంవత్సరాల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి నుంచి భక్తుల గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు టీటీడీ అధికారులు. మొన్న చిరుత సంచారించడంతో.. అలిపిరి నడకమార్గంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు టీటీడీ అధికారులు.
కాగా, తిరుమల శ్రీవారి దర్శనానికి ఏకంగా 08 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి 10 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారిని 64, 527 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారికి 23, 129 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీంతో.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు నమోదు అయింది.