తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని 30 కంపార్టుమెంట్లలో వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీనివాసుని సర్వదర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 75, 963 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 26, 956 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 99 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
అటు తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ అక్టోబర్ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, దర్శన స్టాల్టు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టిటిడి పాలక మండలి.