తిరుమల తిరుపతి దేవస్థానం లాక్ డౌన్ టైంలో ఆర్జిత సేవల టికెట్లున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. అప్పుడు టికెట్లు చేసుకున్న వారందరికీ డిసెంబర్ లోగా దర్శనం చేసుకునే వేసులుబాటు కల్పించింది. లేదు అలా వద్దుకున్న వారికి కూడా టికెట్ల డబ్బు రీఫండ్ పొందేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది టీటీడీ. ఇక ఇప్పటికే టీటీడీ అంచెల వారీగా దర్శనం టిక్కెట్లు సంఖ్యను కూడా పెంచుతూ పోతోంది.
ఇప్పుడు కూడా మూడు వేల మందికి దర్శనం టిక్కెట్లు పెంచే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం మీద జవహర్ రెడ్డి నిన్న స్పందిస్తూ మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జూన్ 8న ప్రయోగాత్మకంగా 6000 మంది భక్తులతో దర్శనాలు ప్రారంభించారు. అప్పటి నుండి గంటకు 500 మంది చొప్పున దర్శనానికి అనుమతి ఇస్తోంది టిటిడి. ప్రస్తుతం రోజుకు 18 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తోంది. ఉదయం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కల్పిస్తోంది.