రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రాలలో కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రాగల 2 రోజులలో దేశం మొత్తం నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 km ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో అక్టోబర్ 29వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.