తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అటు 86900 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
28739 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. అదే సమయంలో.. తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 2.56 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు ఈ నెల అక్టోబర్ 14 అంటే ఇవాళ్టి 17 వరకు తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. ఈ తరుణంలోనే… మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్ళరాదని కోరారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్దంగా వుండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదన్నారు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.