తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
నిన్న 64, 695 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 24,473 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 4.60 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.ఇది ఇలా ఉండగా, తిరుపతిలో ఈ నెల 25వ తేదిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఈ తరుణంలోనే.. నేరుగా, వర్చువల్‌గా పాల్గొనే అవకాశం కల్పించింది టీటీడీ పాలక మండలి. దీంతో నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేయనుంది టీటీడీ పాలక మండలి.