‘ఫ్లడ్‌వాచ్‌’ యాప్‌తో.. వరద సమాచారం ఇట్టే తెలిసిపోతుందిక!

-

దేశవ్యాప్తంగా ఇటీవల వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో చూశాం. ఇటీవల వరద బీభత్స ఘటనలు పెగురుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం ఓ వినూత్న ఆలోచన చేసింది. ఫ్లడ్ వాచ్ పేరుతో ఓ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ సాయంతో వరదను ముందే పసిగట్టొచ్చని చెప్పింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

దేశంలో ఎక్కడ వరదలు సంభవించినా.. ఆ ప్రభావిత ప్రాంతాల రియల్‌ టైమ్‌ సమాచారం ఈ యాప్ లో ప్రత్యక్షం అవుతుందని కేంద్ర జలసంఘం పేర్కొంది. 338 స్టేషన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ యాప్‌ క్రోడీకరిస్తుందని.. తద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుందని సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ కుశ్వీందర్‌ వోహ్రా తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు మొబైల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేసి.. అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ యాప్‌ రూపకల్పన వెనకున్న ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version