తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో 9 కంపార్టుమెంట్లలో వేచివున్నారు తిరుమల భక్తులు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని టీటీడీ పాలక మండలి ప్రకటించింది. 66,590 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 31,052 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లుగా నమోదు అయింది.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం అయ్యాయి. రేపటి నుంచి తోమ్మిది రోజులు పాటు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజులు పాటు 16 వాహనాలు పై భక్తులకు దర్శనం ఇవనున్నారు మలయప్పస్వామి. అటు తొమ్మిది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టిటిడి.కేవలం సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైనులు ద్వారా భక్తులును దర్శనానికి అనుమతించనుంది టిటిడి. అలాగే 6 లక్షల లడ్డులు నిల్వలు….నిత్యం 4 లక్షల లడ్డులు తయ్యారు చేసేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ పాలక మండలి.