నిఫా వైరస్‌పై అలర్ట్ అయ్యామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి రజిని పేర్కొన్నారు. నిఫా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు. ముఖ్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ నిన్నటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యం అన్నారు.
5 దశలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వైద్య ,ఆరోగ్యశ్రీ సేవలు ఎలా వినిగించుకోవాలనేది అవగాహన, సేవలు దశల వారీగా జరుగుతుందని వివరించారు. దాదాపు 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో 105 రకాలు మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 3751 కొత్త ప్రొసిజర్స్ తీసుకుని వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ఓపి లను 2లక్షల 40 మంది ఉపయోగించుకున్నారు అని వివరించారు మంత్రి విడదల రజినీ.